Maha Shivaratri 2021: తెలంగాణలోని పలు జిల్లాల్లో మహా శివరాత్రి వేడుకలు

Maha Shivaratri Celebrations In Telangana
x

మహా శివరాత్రి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Maha Shivaratri 2021: శివనామస్మరణతో ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాలు మారుమోగుతున్నాయి

Maha Shivaratri 2021:

సూర్యాపేట జిల్లా:

సూర్యాపేట జిల్లా, మున్సిపల్‌ పరిధిలోని పిల్లలమర్రి చారిత్రక శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఎరకేశ్వరాలయం, నామేశ్వరాలయాలలో తెల్లవారుజాము నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదిలాబాద్ జిల్లా:

శివనామస్మరణతో ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాలు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శివాలయాలకు బారులు తీరారు.. తమ ఆరాధ్య దైవమైన ఆ భోళా శంకరున్ని దర్శించుకునేందుకు వేకువజామునుంచే ఆలయాలకు వచ్చారు.

హైదరాబాద్:

హైదరాబాద్ శివారులోని కీసర గుట్టలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో ఉన్న శివాలయల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచి శివాలయానికి బారులు తీరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories