Madhu Yashki: రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ మధు యాష్కీ

Madhu Yashki: టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మాజీ ఎంపీ మధు యాష్కీ మండిపడ్డారు.

Arun Chilukuri
Updated on: 26 May 2022 3:45 PM IST
Madhu Yashki Makes Interesting Comments on TPCC President
X

Madhu Yashki: రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ మధు యాష్కీ

Madhu Yashki: టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మాజీ ఎంపీ మధు యాష్కీ మండిపడ్డారు. రెడ్లపై వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ కామెంట్లను తీవ్రంగా తప్పుబడున్నట్లు రేవంత్‌కు లేఖ రాశారు. అన్ని కులాలు, మతాల కలయికే కాంగ్రెస్ పార్టీ అని కానీ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అన్ని కులాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నేతలను సైతం ఇందిరాగాంధీ అక్కున చేర్చుకున్నారని రేవంత్‌ రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కడం వెనుక రాహుల్, సోనియా గాంధీల చొరవే అన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగల్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42 లోక సభ స్థానాలకు గాను 41 కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గుర్తు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story