Madhavaram Krishna Rao: ‘కల్యాణ లక్ష్మి’ చెక్కులు ఇవ్వకపోతే ధర్నా చేస్తా..

Madhavaram Krishna Rao: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Nov 2024 1:26 PM IST
Madhavaram Krishna Rao Demands to Distribute Kalyana Lakshmi Cheques
X

Madhavaram Krishna Rao: ‘కల్యాణ లక్ష్మి’ చెక్కులు ఇవ్వకపోతే ధర్నా చేస్తా..

Madhavaram Krishna Rao: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేయటంతో..ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలు పంపిణీ చేసే ఆనవాయితీని కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. లబ్దిదారులు చెక్కుల కోసం తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెక్కుల పంపిణీకి రావొద్దంటే.. రానని.. కానీ చెక్కులు మాత్రం వెంటనే పంపిణీ చేయాలన్నారు. దుర్మార్గపు రాజకీయాలకు సామాన్య, నిరుపేద ప్రజలను బలి చేయొద్దన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఇబ్బంది పెట్టితే ఊరుకోమని.. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్దిదారులకు పంపిణీ చేయకపోతే MRO ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు. అయితే.. ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story