Hyderabad: హైదరాబాద్‌లో గబ్బు లేపుతున్న పబ్బులు

Madhapur SOT Police Raids Masti Pub | Hyderabad News
x

Hyderabad: హైదరాబాద్‌లో గబ్బు రేపుతున్న పబ్‌లు

Highlights

Hyderabad: కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు

Hyderabad: హైదరాబాద్‌లో పబ్‌లు గబ్బు రేపుతున్నాయి. ఎన్ని దాడులు చేసినా నిర్వాహకులు మాత్రం మారడంలేదు. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో క్లబ్ మస్తీ పబ్ పై మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్ మస్తీ పబ్‌లో కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు, పరిమితికి మించి డీజే సౌండ్లతో పబ్ నిర్వహిస్తున్న విషయం కూడా వెల్లడైంది. దాడుల సందర్భంగా 9 మంది యువతులు, పబ్ మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ ధనరాజ్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు కృష్ణ, విష్ణు పరారయ్యారు. దాడుల సందర్భంగా పోలీసులు క్లబ్ మస్తీ పబ్‌లో డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్నవారిని ఎస్వోటీ పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories