మలుపు తిరిగిన మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసు

* ప్రమాదానికి కారణమైన సృజన్‌కుమార్ అరెస్ట్ * సృజన్‌ కారు ఢీకొనడంతో మహిళ మృతి * సృజన్‌ వెహికిల్‌పై 11కు పైగా చలాన్‌లు

Sandeep Reddy
Updated on: 4 Oct 2021 1:30 PM IST
Madhapur Hit and Run Case Accused Srujan Kumar Arrested
X

మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసు 

Madhapur Road Accident: మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రమాదానికి కారణమైన సృజన్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సీఐఐ జంక్షన్‌ దగ్గర యాక్సిడెంట్ చేసి పారిపోయాడు సృజన్ కుమార్. సృజన్‌కుమార్ కారు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. సృజన్‌కుమార్ వెహికిల్‌పై 11కు పైగా చలాన్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చలాన్లన్ని డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్‌ డ్రైవింగ్‌లకు చెందినవే.

శనివారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ప్లాట్‌లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే శనివారం ఇంటికి వెళ్లకుండా ఆదివారం ఉదయం కారులో ఇంటికి బయల్దేరారు. ఇక మద్యం మత్తులోనే ర్యాష్‌ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్‌ చేసినట్లు నిర్ధారించారు. సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా సృజన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story