మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కదులుతున్న డొంక.. నిందితుల జాబితాలో సినీ ప్రముఖులు

Madhapur Drugs Case: డ్రగ్స్‌ కొనుగోలు చేసినవారిలో రాంచంద్‌, అర్జున్, సందీప్

Shekhar G
Published on: 1 Sept 2023 6:23 PM IST
Madhapur Drug Case Updates
X

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కదులుతున్న డొంక.. నిందితుల జాబితాలో సినీ ప్రముఖులు

Madhapur Drugs Case: హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో డొంక కదులుతోంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడుగురు నిందితులు డ్రగ్స్ అమ్మేవారుగా గుర్తించిన పోలీసులు.. 17 మంది సేవించేవారుగా గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 23 మందిని అరెస్ట్ చేశారు. ఇక.. నిందితుల జాబితాలో మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు చేరాయి. డ్రగ్స్ కొనుగోలు చేసినవారి లిస్టులో రాంచంద్ , అర్జున్, సందీప్, ఉప్పలపాటి రవి, ఇంద్రతేజ, సురేష్ రాంకుమార్, ప్రణీత్, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్ హిటాచీ, అజీమ్, అంజద్ పేర్లు ఉన్నాయి. మరికొందరు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనూ రవి, సుశాంత్, కలహర్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వైజాగ్ కు చెందిన రాముతో పాటు.. ముగ్గురు నైజీరియన్ పెడ్లర్లను విచారిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story