Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Madhapur Drug Case: హైదరాబాద్ విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన 18 మంది డ్రగ్ కస్టమర్స్

Shekhar G
Published on: 13 Sept 2023 2:43 PM IST
Madhapur Drug Case Investigation Is In Full Swing
X

Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ నిర్వహించిన నిందితులను నార్కొటిక్ బ్యూరో అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలు కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రగ్ పార్టీని భగ్నం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న నార్కొటిక్ బ్యూరో అధికారులు నిందితులను విచారించారు.

సినీ ఇండస్ట్రీకి చెందిన 18 మంది ప్రముఖులు, మరికొంత మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఫైనాన్షియర్ వెంకట్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే డ్రగ్స్ తీసుకున్నవారి పేర్లు బయటికిచెప్పడంతో.. వెంకట్ కాంటాక్ట్స్‌లోని కస్టమర్లు ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కస్టమర్లతో కేవలం స్నాప్‌చాట్‌లో మాత్రమే చాట్ చేసినట్లు ఫైనాన్షియర్ వెంకట్ పోలీసుల విచారణలో తెలిపాడు.

మరోవైపు వెంకట్ అరెస్ట్‌తో తమ స్నాప్ చాట్ అకౌంట్లను డ్రగ్స్ తీసుకున్న కస్టమర్లు తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారు హైదరాబాద్ విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కస్టడీలోకి తీసుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు మరో మూడ్రోజులపాటు విచారించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story