హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు

హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు
x
Highlights

హైదరాబాద్‌ నగరంలో వీధి కుక్కలు జనాలను హడలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. కుక్క కాటుతో బాధితులతో ఆసుపత్రులు...

హైదరాబాద్‌ నగరంలో వీధి కుక్కలు జనాలను హడలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. కుక్క కాటుతో బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రోజుకు వందల మంది బాధితులు ఆసుపత్రులకు వస్తున్నారు. ఒక్క ఫివేర్ హాస్పిటల్ లోనే దాదాపు యాభై మందికి పైగా వస్తున్నారు.

కాలనీల్లో ఎక్కడ చూసిన కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని..బయట తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని మహిళలలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారువీధి కుక్కల బెడతతో అసలు ఒంటరిగా కాలనిల్లో తిరగలేకపోతున్నామని కుక్కల బాధితులు లబోదిబోమంటున్నారు. పలు మార్లు అధికారులకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కుక్కకాటు బాధితులు రోజుకు 50 మంది వరకు ఫీవర్‌ ఆసుపత్రికి వస్తున్నారని ఫీవర్ హాస్పిటల్ సూపరెండెంట్ శంకర్‌ తెలిపారు.ఆసుపత్రిలో మందుల కొరత లేదని క్లారిటీ ఇచ్చారు.అధికారులు ఇప్పటికైనా మేల్కొని కుక్కలని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ ప్రజలు కోరుతున్నారు..ఆసుపత్రులలో సరిపడా మందులు కూడా ఉండేలా ప్రభుత్వం చూడాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories