ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చలి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చలి
x
Highlights

* గ్రామాలు, పట్టణాల్లో కనిపిస్తున్న చలిమంటలు * ఉదయం పూట ప్రజలు బయటకు రాని ప్రజలు * పది దాటినా విడువని చలి తీవ్రత * కుమ్రంభీం జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత * బేల మండలంలో 7.9 డిగ్రీ అత్యత్ప ఉష్ణోగ్రత

తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు. కశ్మీర్‌ను మరిపించే చలితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వణుకుతోంది. ఓ వైపు శీతల గాలులు, మరోవైపు చలి తీవ్రత ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పెరిగిన చలి తీవ్రతతో కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. స్వెట్టర్, దుప్పటి లేనిదే బయటకు రావడం లేదు. చలి నుంచి బయట పడేందుకు జనాలు మంటలను కాచుకుంటున్నారు. తెలంగాణ కశ్మీర్ ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.......

అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను చలి వణికిస్తోంది. మన్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం తొమ్మిది దాటిన ఇళ్లనుంచి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. చలి ఎక్కువగా పెడుతుంది. కుమ్రంభీం జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, బేల మండలంలో 7.9 డిగ్రీ అత్యత్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

చలి తీవ్రత పెరుగుతుండటంలో ప్రజలు చలి భయంలో వణుకుతున్నారు. ఎముకలు కొరికే చలి వల్ల.. పనులు చేసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట పనులు చేసుకునే రైతులు, పారిశుద్ధ్య కార్మికులు, పేపర్ బాయ్‌ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చలి దెబ్బకు మార్నింగ్ వాకర్స్ సైతం వాకింగ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

భారీగా పెరిగిన చలి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉన్ని దుస్తులు, షెటర్లు ధరిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసిన ప్రజలు చలి మంటల కాచుకుంటున్నారు. ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదని వాపోతున్నారు.

ఉదయం పూట పనులకు వెళ్లే వారి పరిస్థితి చలి వల్ల మరింత దారుణంగా తయారు అయింది. దుప్పట్లు కప్పుకుని మరి పనులకు వెళ్తున్నారు.. చలి తీవ్రత పెరుగడం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత వల్ల జ్వరం, జలుబు బారిన పడుతున్నారు. అదే విధంగా అస్తమా రోగులు చలి తీవ్రత పెరగడం వల్ల.. శ్వాస తీసుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు చలి తీవ్రత పెరుగడం వల్ల కరోనా వ్యాది విజృంభిస్తుందని ప్రజలు భయపడుతున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories