Top
logo

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి తన పంజాను విసురుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత...

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి తన పంజాను విసురుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీమం జిల్లాల్లో గతంలో లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అటు ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు వీపరీతంగా పడిపోయాయి. దాంతో చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి. దీనికి తోడు పలు గ్రామాలను పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 9 గంటలు దాటితే గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు గ్రామాల్లో ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని చలి నుంచి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి మూడు రోజుల్లో 3 నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అటు విశాఖ ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే 3.7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్‌లోనే అత్యల్పంగా చింతపల్లిలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, నందిగామలో 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతిశీతల ప్రాంతాలైన లంబసింగి, పాడేరు ఘాట్, డల్లాపల్లి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత పదేళ్లలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ తెలిపింది.

Web Titlelow cold temperatures recorded in Telugu states
Next Story