Narsingi: ప్రేమికుల రోజు అదృశ్యమైన ప్రేమజంట కథ విషాదాంతం..

Lovers: మెదక్‌ జిల్లా నార్సింగిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 16 Feb 2023 10:24 AM IST
Lovers Suicide in Narsingi
X

Narsingi: ప్రేమికుల రోజు అదృశ్యమైన ప్రేమజంట కథ విషాదాంతం.. 

Lovers: మెదక్‌ జిల్లా నార్సింగిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ నెల 14న ఖలీల్‌, కల్పన కనిపించకుండా పోయారు. అయితే.. స్థానికంగా ఉన్న చెరువుగట్టు దగ్గర బైక్‌, చెప్పులను స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు.. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇవాళ ఉదయం చెరువులో ఖలీల్‌, కల్పన మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే.. ఇటీవలే కల్పనకు వేరే యువకుడితో వివాహం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story