ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

X
Highlights
సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువులో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. చివ్వెంల మండలం చందుపట్ల...
Arun Chilukuri11 Dec 2020 5:46 AM GMT
సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువులో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్(21), ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే, వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం ఇద్దరూ ఇంట్లో నుంచి బటయకు వచ్చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి వచ్చిన ఇద్దరు మొద్దులచెరువు స్టేజ్ దగ్గర చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Web Titlelovers end lives in munagala
Next Story