ప్రేమ..పగ..విషాదం

ప్రేమ..పగ..విషాదం
x
Highlights

హైదరాబాద్‌ నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఈ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి...

హైదరాబాద్‌ నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఈ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి ఇద్దరూ శనివారం సాయంత్రం నార్సింగి మంచిరేవుల ప్రాంతంలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. సంపత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి తాము పురుగుల మందు తాగామని తమను ఆస్పత్రికి తరలించాలని ఫోన్ చేయడంతో స్నేహితుడు, పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంపత్‌, పార్వతి పాఠశాలలో చదువుకునేటప్పటి నుంచే ప్రేమించుకున్నారు. ఇంటర్‌వరకు చదువుకున్న పార్వతికి ప్రేమించిన యువకుడిని కాదని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిసింది. పార్వతికి 8 ఏళ్ల క్రితం పెళ్లయిందని,ఒక బాబు(5) ఉన్నాడని సమాచారం. ఆమె కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఈ నెల 6న అర్ధరాత్రి పార్వతి ఇంటి నుంచి వెళ్లిపోగా, 7న కుటుంబ సభ్యులు సదాశివపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories