హైదరాబాద్ లో పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు

Murder In Sangareddy : హైదరాబాద్ లో పరువు హత్య కలకలం రేపుతుంది.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గాను ఓ యువకుడిని అత్యంత దారుణంగా చంపేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Krishna
Updated on: 25 Sept 2020 11:32 AM IST
హైదరాబాద్ లో పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు
X

Murder In Sangareddy

Murder In Sangareddy : హైదరాబాద్ లో పరువు హత్య కలకలం రేపుతుంది.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గాను ఓ యువకుడిని అత్యంత దారుణంగా చంపేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చందానగర్ కి చెందిన హేమంత్ ఓ అమ్మాయిని గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు.. ఈ విషయం సదరు యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ అమ్మాయికి గత కొంతకాలంగా ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదీన వారిద్దరూ బయటకి వచ్చి బీహచ్‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ పెళ్లిని యువతి తల్లిదండ్రులతో పాటుగా బంధువులు కూడా వ్యతిరేకించారు.. ఈ తరుణంలో వాళ్ళిద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో నివాసం ఉంటున్నారు. అయితే నిన్న(గురువారం) 3 గంటల సమయంలో యువతి బంధువులు మరియి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి వారిని బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. అందులో హేమంత్ భార్య తప్పించుకోగా, హేమంత్ ని తీసుకువెళ్ళారు.

జరిగిన విషయాన్ని హేమంత్ తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్న క్రమంలో హేమంత్‌ శవమై కనిపించాడు. అయితే ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతోనే యువతి తండ్రి ఈ హత్య చేయించాడని హేమంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కన్నకొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపైన కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హేమంత్ కి తల్లిదండ్రులుతో పాటుగా సుమంత్ అనే సోదరుడు ఉన్నాడు.

Krishna

Krishna

Next Story