Lockdown in Telangana: నేటి నుంచి అన్ని దేవాలయాల్లో దర్శనాల రద్దు

Lockdown in Telangana: లాక్ డౌన్ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Published on: 12 May 2021 10:26 AM IST
Lockdown in Telangana: Temples Will be Closed From Today
X

ఇంద్రకరణ్ రెడ్డి (ఫైల్ ఇమేజ్ )


Lockdown in Telangana: లాక్ డౌన్ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి తెలంగాణలోని ఆలయాల్లో భక్తుల దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 21 వరకు దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి పది రోజుల పాటు లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story