Telangana: మరో పది రోజులు లాక్ డౌన్ పొడిగింపు

Lock down Extends Telangana
x

Lockdown Extends

Highlights

Telangana: తెలంగాణ క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్ర‌భుత్వం విధించిన లాక్ డౌన్ రేప‌టితో ముగిసిపోనుంది. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్...

Telangana: తెలంగాణ క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్ర‌భుత్వం విధించిన లాక్ డౌన్ రేప‌టితో ముగిసిపోనుంది. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్ పై చ‌ర్చింన స‌ర్కార్ పొడిగింపునకు మొగ్గు చూపింది. తెలంగాణలో లాక్‌డౌన్ మ‌రో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్‌.. మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్నిమూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. నాలుగు గంట‌లు ఉన్న స‌డ‌లింపును ఏడు గంట‌ల‌కు పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories