Lockdown Effect: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో సందిగ్ధం

Massive traffic jam at AP-Telangana border amid lockdown
x

Lockdown Effect: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో సందిగ్ధం

Highlights

Lockdown Effect: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆక్షల నేపథ్యం భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Lockdown Effect: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రయాణీకు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడంతో.. ఒక్కసారిగా నిన్న సాయంత్రం నుంచి ఏపీకి వాహనాలు క్యూ కట్టాయి. అయితే, ఏపీలో నైట్ కర్ప్యూ అమల్లో ఉండడంతో వాహనాలను అనుమతించలేదు రాష్ట్ర సరిహద్దు పోలీసులు. అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. అటు, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలు కూడా బోర్డర్‌లో ఇబ్బందులు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో ఉదయం 10 దాటితే తెలంగాణలోకి వాహనాల అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అటు మధ్యాహ్నం 12 దాటితే ఏపీలోకి వాహనాలకు నో ఎంట్రీ అమల్లోకి వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోకి వెళ్లే వాహనాలతో విజయవాడ – హైదరాబాద్ హైవే నిండిపోయింది. అత్యవసర వాహనాలు, ట్రాన్స్ పోర్ట్ వాహనాలను, ప్రత్యేక అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే ఇరు రాష్ట్రాలు అధికారులు దారి ఇస్తున్నారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ – ఆంధ్రా సరిహద్దు దాటాలంటే తప్పనిసరిగా ఈ పాస్‌ ఉండాల్సిందేనంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద ప్రయాణికులను అనుమతించడంలేదు. సరిహద్దు దాటాలంటే ఈ పాస్‌ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో అనేకమంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories