ఆకట్టుకున్న తెలంగాణా సాయుధ రైతుపోరాట లైవ్ పెయింటింగ్స్

ఆకట్టుకున్న తెలంగాణా సాయుధ రైతుపోరాట లైవ్ పెయింటింగ్స్
x
Highlights

లైవ్‌ పెయింటింగ్‌తో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చిత్రాలు రగిలిపోతున్నాయి. ‌తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరిస్తూ నల్గొండ జిల్లాలో లైవ్...

లైవ్‌ పెయింటింగ్‌తో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చిత్రాలు రగిలిపోతున్నాయి. ‌తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరిస్తూ నల్గొండ జిల్లాలో లైవ్ పెయింటింగ్ చేస్తూ చరిత్రను గుర్తు చేస్తున్నాడు. ‌ఒక్క చిత్రం వేల భావాలను అందిస్తుంది. రచయిత వెయ్యి మాటల్లో చెప్పే భావాల్ని చిత్రకారుడు చిన్న బొమ్మ ద్వారా వ్యక్తం చేయగలడు. పైగా మాటలకంటే చిత్రాలకే మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. కళాకారుడి కుంచె నుంచి జాలువారిన ఒక్క చిత్రం వేల భావాలను పలికిస్తూ విప్లవాన్ని రగిలిస్తోంది.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరితను ప్రతిబించేలా తన కుంచె ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియపర్చలకున్నాడు ఆ చిత్రకారుడు. కళ... కళ కోసం కాదు ప్రజలకోసం అంటున్నాడు ఆ చిత్రకారుడు. ఆయన తన ప్రతిభతో ప్రజల చైతన్యాన్ని రగిల్చేలా ఉండాలని కోరుకుంటాడు. సమాజ హితమే తమ జీవిత లక్ష్యంగా చేసుకున్న ఆ చిత్రకారుడు తాను గీసే ప్రతి చిత్రం సామాజిక అంశాలపై ప్రభావితం చేసేలా ఉంటాయి.

నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురంలో బరిగెల యాదయ్య లక్ష్మమ్మ లకు జన్మించిన బరిగెల శ్రీనివాస్ తన తల్లి దినసరి కూలీ, తండ్రి చిన్నపాటి చిరుద్యోగి. విద్యాభ్యాసం పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబంలో శ్రీనివాస్ చదువుకునే రోజుల్లోనే పుస్తకాలపై పెన్నులతో పెన్సిల్ తో తన మనసులో దాచుకున్న చిత్రాలను అలవోకగా గీసేవాడు. శ్రీనివాస్ కమ్యూనిస్టు చరిత్ర, పేదోళ్ల బ్రతుకు వెతలపై విశ్లేషణ చేస్తూ తన కుంచె ద్వారా ప్రజలకు తెలియజేయడంలో దిట్ట. ‌

తెలంగాణ విమోచన, విలీన, విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ చిత్రకారుడు బరిగెల శ్రీనివాస్ వేసిన లైవ్ పెయింటింగ్ విశేషాంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు ఎర్రటి జెండాలు చేతబట్టి పోరాటంలో పాల్గొనేవారని, రాజకార్ల తూటాలకు ఎదురొడ్డి నిలబడేవారని, ఎన్ని బందూకులూ పేలినా ఎత్తిన జెండా దించకుండా ఎదురొడ్డి పోరాటం చేస్తున్న చిత్రం బాగా ఆకట్టుకుంటుంది. అమరవీరుల స్థూపం వద్ద ఒక ఉద్యమకారుడు రజాకారుల తుపాకి గొట్టానికి చేతిని అడ్డం పెట్టి కొడవలిని ఎత్తి పోరాటానికి సిద్దంగా ఉన్న మరో చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది.

నిజాం నవాబు అరాచకాలపై కారంపొడి, రోకల్లందుకుని తిరుగుబాటు చేస్తూ వారిని అంతమొందించిన యుద్ధ భూమి, ఆ పోరులో నేల రాలిన అమరులను స్మరిస్తూ నెత్తుటి మరకల సజీవ సాక్ష్యం గుండ్రంపల్లిలో నేటికి చెదరని చరిత్ర సాక్ష్యం శ్రీనివాస్ గీసిన చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. బాంబుల వర్షం కురిసినా బారు ఫిరంగులు మోగినా ఎత్తిన జెండా దించకోయ్ అరుణపతాకకు జై జై అంటూ గీసిన మరో చిత్రం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఘట్టాలు నేడు మన కళ్ళ ముందు కనిపించేలా గీశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories