Mahabubabad: లైవ్‌ ఫిష్‌ లారీ బోల్తా.. చేపల కోసం ఎగబడ్డ జనాలు..

Fish Lorry: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Sept 2024 11:16 AM IST
Live Fish Lorry Overturned In Mahabubabad Maripeda
X

Mahabubabad: లైవ్‌ ఫిష్‌ లారీ బోల్తా.. చేపల కోసం ఎగబడ్డ జనాలు..

Fish Lorry: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో జనాలు చేపల కోసం ఎగబడ్డారు. ఉదయం ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ మరిపెడ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న చేపలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో చేపల కోసం ప్రజలు పోటీపడ్డారు. అందినకాడికి పట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపుచేశారు. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రమాదానికి గురైన లారీని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story