TS Congress: రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల..?

TS Congress: ఒకేసారి అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం

Shekhar G
Published on: 12 Oct 2023 2:00 PM IST
List Of Telangana Congress Candidates To Be Released Tomorrow?
X

TS Congress: రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల..?

TS Congress: రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ అభ్యర్ధులను ‌ఖరారు చేయనున్నట్టు సమాచారం. రేపు జరగబోయే ఈ భేటీకి ఠాక్రేతో పాటు.. రేవంత్‌, భట్టి హాజరవనున్నారు. అయితే.. చివరి నిమిషంలో మరికొన్ని చేరికలుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బస్సు యాత్ర తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకేసారి అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో.. ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story