Weather Report: తెలంగాణకు చల్లని కబురు.. రానున్న 5రోజులపాటు తేలికపాటి వర్షాలు

Weather Report: గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఎదురు గాలులు

Shashank Gullapelli
Published on: 9 April 2024 8:20 PM IST
Light Rains For Another 5 Days In Telangana
X

Weather Report: తెలంగాణకు చల్లని కబురు.. రానున్న 5రోజులపాటు తేలికపాటి వర్షాలు 

Weather Report: తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాగల ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం తెలంగాణలో కిందిస్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు తెలిపింది. రెండురోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు నమోదు కాగా... మంగళవారం 40 డిగ్రీల ఉష్ణోగ్రతే అధికంగా నమోదు అయింది. ఐదురోజులపాటు ఉష్ణోగ్రతల ప్రభావం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story