Ponnam Prabhakar: దసరాకు అందరం ఈ ప్రతిజ్ఞ చేద్దాం

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2024 11:47 AM IST
Lets all take this pledge for Dussehra
X

Ponnam Prabhakar: దసరాకు అందరం ఈ ప్రతిజ్ఞ చేద్దాం

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నట్లు చెప్పారు.

కాగా ఈ దసరా పండుగ సందర్భంగా అందరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామంటూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, అది ప్రమాదానికి హెచ్చరికగా గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story