Komuram Bheem Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో చిరుత కలకలం

Komuram Bheem Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది.

Arun Chilukuri
Published on: 4 Dec 2025 11:40 AM IST
Komuram Bheem Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లాలో చిరుత కలకలం
X

Komuram Bheem Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది. సిర్పూర్‌ టి.భీమన్న సమీపంలో చిరుతపులి సంచారం.. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. రైల్వేబ్రిడ్జ్‌పై చిరుతపులి పరుగులు తీయడాన్ని అక్కడున్న వాహనదారులు గుర్తించి.. తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో.. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులిని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story