Leopard: మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిరుత కలకలం

Leopard: మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిరుత కలకలం రేగింది.

Arun Chilukuri
Updated on: 10 Jun 2021 2:24 PM IST
Leopard Spotted at Burugupally in Mahabubnagar District
X

Leopard: మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిరుత కలకలం

Leopard: మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిరుత కలకలం రేగింది. బూర్గుపల్లి శివారులో పశువుల మందపై చిరుత దాడికి యత్నించింది. అయితే పశువులు ప్రతిఘటించడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. నడుముతో పాటు వెనుక భాగంలోని రెండు కాళ్లకు దెబ్బలు తగలడంతో నడవలేని స్థితిలో చిరుత పడి ఉంది.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు చిరుతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దాహంతో అలమటిస్తున్న చిరుతకు నీటిని అందించారు. ఇంతలో ఓ వ్యక్తి చిరుతను కర్రతో హెచ్చరిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా అక్కడున్నవారు అతడిని వెనక్కి లాగేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. మత్తు మందు ఇచ్చి చిరుతను తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story