వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చిరుతపులి సంచారం...!

* గన్నారం గ్రామంలో దూడపై దాడి చేసిన చిరుత... పులి పాదముద్రలు గుర్తించిన స్థానికులు

R Tripura Malini
Published on: 14 Nov 2022 11:09 AM IST
Leopard migration in Rayaparthi mandal of Warangal district
X

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చిరుతపులి సంచారం

Cheetah In The Town: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గన్నారం గ్రామంలో ఓ వ్యవసాయ భూమి వద్ద దూడపై చిరుత పులి దాడి చేసింది. పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో చిరుత సంచారం దృశ్యాలు రికార్డయ్యాయి. రెండ్రోజులు క్రితం సూరారం గ్రామంలో పులి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. అదే చిరుత పులి తమ గ్రామంలోకి వచ్చిందని భావిస్తున్నారు. ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గన్నారం ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story