బావిలోంచి తప్పించుకున్న చిరుత

X
Highlights
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌లోని వ్యవసాయ బావిలో పడ్డ చిరుతను బంధించేందుకు చేసిన ప్రయత్నా...
Arun Chilukuri14 Jan 2021 9:56 AM GMT
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌లోని వ్యవసాయ బావిలో పడ్డ చిరుతను బంధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాత్రి సమయం కావడంతో చిరుతను బయటకు తీసే ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇవాళ ఉదయం బావి దగ్గరకు వెళ్లి చూసేసరికి చిరుత లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుత ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు కళ్లారా చూడటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎటువైపు వెళ్లిందనే దానిపై ఇంకా అధికారులు నిర్థరణకు రాలేదు.
Web TitleLeopard escaped from well
Next Story