Gutta Sukhendar Reddy on Coronavirus: మా ఇంట్లోనే ఆరుగురు కరోనాను జయించారు: గుత్తా సుఖేందర్

Arun Chilukuri
Published on: 26 July 2020 11:22 AM IST
Gutta Sukhendar Reddy on Coronavirus: మా ఇంట్లోనే ఆరుగురు కరోనాను జయించారు: గుత్తా సుఖేందర్
X

Gutta Sukhendar Reddy on Coronavirus: కరోనాతో సహజీవనం తప్పదు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...కరోనా తో సహజీవనం చేయాల్సిందే. లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. మా ఇంట్లో ఆరుగురు కరోనాను జయించారు. పిహెచ్ సెంటర్లలో కూడా ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వం లో ఓక విజన్ తో రాష్ట్రం ముందుకు పోతుంది. ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు కొత్త సచివాలయ నిర్మాణం అభివృద్ధి కి సూచికగా నిలుస్తుంది. ఉమ్మడి నల్గొండలో 3 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేయడం ఓ అద్భుతమన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా 100 అంబులెన్స్‌లు సమకూర్చడం అభినందనీయమని వాటితో ప్రజలకు ఎంతో ఉపయోగమని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ విద్య వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కేటీఆర్ భవిష్యత్తు ఉన్న నాయకుడు అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story