లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
x
Highlights

ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షలను రాయాలనుకున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరీక్షల నిర్వహన షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షలను రాయాలనుకున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరీక్షల నిర్వహన షెడ్యూల్ ను విడుదల చేసింది. శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో టీఎస్‌ లాసెట్, పీజీఎల్‌సెట్‌ కన్వీనర్‌ మార్చి 2న లాసెట్, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రవేశ పరీక్షలను రాయలనుకునే విద్యార్థుల దరఖాస్తులను మార్చి 6వ తేది నుంచి ఏప్రిల్‌ 6వ తేది వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే వారికి మే 20వ తేది వరకు సమయం పొడిగించారు. పరీక్షల విషయానికొస్తే మే 27వ తేదీన లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్ష నిర్వహిస్తారని స్పష్టం చేసారు. లాసెట్‌ దరఖాస్తు రుసుము రూ. 800 ఉండగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది.

పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు రుసుము 1000 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలు హాల్ టికెట్లను మే 21 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్ర దించాలని సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories