ముగిసిన అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు.. పాడె మోసి నివాళులర్పించిన మంత్రులు..

FRO Srinivasa Rao: విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Arun Chilukuri
Published on: 23 Nov 2022 3:12 PM IST
Last Rites of the FRO Srinivasa Rao Completed
X

ముగిసిన అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు.. పాడె మోసి నివాళులర్పించిన మంత్రులు..

FRO Srinivasa Rao: విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు, అటవీ శాఖ అధికారుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story