Hyderabad: హైదరాబాద్ చార్మినార్ దగ్గర భారీగా రోడ్లపైకి జనం

Hyderabad: ఈద్ నేపధ్యంలో షాపింగ్ కోసం రోడ్లపైకి పెద్ద ఎత్తున జనం

Sandeep Eggoju
Published on: 6 May 2021 5:52 PM IST
Large Number of People Busy in Shopping for Eid ul Fitr in old City Charminar
X

చార్మినార్ వద్ద అధిక జనం (ఫైల్ ఇమేజ్)

Hyderabad: దేశంలో అసలు కరోనా ఉందా..? ప్రతిరోజు వేలల్లో మరణాలు సంభవిస్తున్నా ప్రజల్లో భయమనేదే లేదా..? ప్రాణాల కంటే షాపింగే ఇంపార్టెంటా? ఓల్డ్ సిటీ చార్మినార్‌లో దృశ్యాలను చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఓవైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు షాపింగ్‌లో బిజీ అయిపోయారు నగరవాసులు. ఈద్ నేపధ్యంలో పాతబస్తీ చార్మినార్‌లో షాపింగ్ కోసం గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చారు. అసలు కరోనా భయమే లేదన్నట్టుగా విచ్చల విడిగా తిరిగేస్తున్నారు.

సోషల్ డిస్టెన్స్ మాట సక్కన పెడితే కొందరు కనీసం మాస్కులు కూడా వాడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో జనం ఈ రేంజ్‌లో రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ గుంపులో ఒక్కరికి కరోనా ఉన్నా పెను ప్రమాదం తప్పదు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story