Landmine Blast: తెలంగాణ-చత్తీస‌ ఘడ్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు

Landmine Blast: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా చెన్నాపురం అడవుల్లో పేలుడు

Rama Rao
Published on: 22 Feb 2022 11:25 AM IST
Landmine Blast on Telangana-Chhattisgarh Border | TS News Today
X

తెలంగాణ-చత్తీస‌ ఘడ్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు

Landmine Blast: తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. పేలుడులో చెన్నాపురానికి చెందిన గిరిజనుడు దేవయ్యకు చెందిన ఒక ఎద్దు తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న చర్ల సిఐ అశోక్ పశువైద్య సిబ్బందిని వెంట బెట్టుకుని చెన్నాపురానికి వెళ్లి ఎద్దుకు చికిత్స చేయించారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి గిరిజనులతోపాటు పశువులు ప్రమాదాల బారిన పడుతున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story