Munugodu: ఇవాళ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం..!

Kusukuntla prabhakar reddy will take oath today
x

నూతన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

Highlights

* ఉ.11గంటలకు శాసనసభ స్పీకర్ సమక్షంలో కార్యక్రమం

Kusukuntla Prabhakar Reddy: మునుగోడు నూతన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మునుగోడు నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించటంతో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 105కు చేరింది. ఆరుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ బలం రాజగోపాల్‌రెడ్డి ఓటమితో ఐదుకు పడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories