Munugode ByPoll: ఇవాళ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్‌

Kusukuntla Prabhakar Reddy Nomination Today
x

Munugode ByPoll: ఇవాళ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్‌

Highlights

Munugode ByPoll: ఉ.11 గంటలకు నామినేషన్‌ వేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

Munugode ByPoll: మునుగోడు బైపోల్‌ వార్‌ ఊపందుకుంది. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇవాళ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్‌ వేయనున్నారు. ఇక.. కూసుకుంట్ల నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, వామపక్ష నేతలు పాల్గొనున్నారు. బంగారుగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీగా వచ్చి.. నామినేషన్ వేయనున్నారు కూసుకుంట్ల.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల కదనరంగంలో కత్తులు దూసుకుంటున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి, చివరిరోజు కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ వెయ్యనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ మరింత ఫోకస్ చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బై పోల్ చావో రేవో గా మారింది.

మునుగోడులో నామినేషన్ పర్వం తుది అంకానికి చేరుకొంది. నామినేషన్‌ ప్రక్రియ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో... నామినేషన్ వేసేందుకు పార్టీల అభ్యర్థులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటివరకు 32 మంది అభ్యర్థులు 52 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి మూడు సెట్లు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా.. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి తరుపున అనుచరులు ఒకసెట్ నామినేషన్ వేశారు. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయనున్నారు. రేపు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇతర పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు కసరత్తులు చేసుకుంటున్నారు.

ఇప్పుడు మునుగోడు బరిలో నిలవాలని తెలంగాణ టీడీపీ భావిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్‌ పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. బీసీ వర్గానికి చెందిన ఆయన... ప్రస్తుతం టీటీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గంలో బీసీ వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మునుగోడు బై పోల్ ప్రచారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేయడంతో పాటు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి ప్రధాన పార్టీలు. తమ బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను వీక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాతో పాటు అన్ని మార్గాలను ఆశ్రయిస్తున్నాయి పార్టీలు.

ఇక ప్రచారంలో భాగంగా అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించనుంది. చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. గట్టుప్పల్ మండల కేంద్రంలో రాజగోపాల్‌ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీరాజ్‌ గోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నోఏళ్లుగా ఉద్యమం చేసినా రాని గట్టుప్పల్‌ మండలం.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఒక్కరోజులోనే వచ్చిందనే విషయాన్ని.. జనాల్లోకి తీసుకెళ్తూ ఆమె ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. మునుగోడు మండలంలో ప్రచారం చేశారు. నాంపల్లి మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ఇక.. మునుగోడు బైపోల్‌ రంగంలోకి నేరుగా సీఎం కేసీఆర్‌ దిగుతున్నారు. ఈ నెల 30న చండూరులో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి అక్కడి లీడర్లతో మంత్రి జగదీష్‌రెడ్డి చర్చించారు. దీంతో మునుగోడులో రోజు రోజుకు పొలిటికల్‌ హీట్‌ మరింత పెరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories