Kunduru Jana Reddy: ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా సీనియర్ నేత.. ఈసారి ఎన్నికల బరిలోకి జానారెడ్డి కుమారులు

Kunduru Jana Reddy: నాగార్జునసాగర్ నుంచి చిన్నకుమారుడు జయవీర్‌రెడ్డి అప్లికేషన్

Shekhar G
Updated on: 25 Aug 2023 1:30 PM IST
Kunduru Jana Reddy Opts Out Of Telangana Assembly Elections
X

Kunduru Jana Reddy: ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా సీనియర్ నేత.. ఈసారి ఎన్నికల బరిలోకి జానారెడ్డి కుమారులు

Kunduru Jana Reddy: ప్రత్యక్ష ఎన్నికల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దూరంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈసారి తన కుమారులను ఎన్నికల బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‎ఇందులో భాగంగానే గాంధీ‎భవన్‌లో జానారెడ్డి కుమారులు ఎమ్మెల్యే టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డి, నాగార్జునసాగర్ నియోజవకర్గ టికెట్‌ కోసం చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో జానారెడ్డి పోటీలో లేరనే దానికి కుమారుల దరఖాస్తు బలాన్ని చేకూరుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story