MLA Krishna Rao: నేను రాజీనామాకు సిద్ధం.. లేదంటే బండి సంజయ్‌ రాజీనామా చేస్తారా?

MLA Krishna Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు.

Arun Chilukuri
Published on: 15 Sept 2022 3:30 PM IST
Kukatpally Mla Krishna Rao Challenged Bandi Sanjay On Land
X

MLA Krishna Rao: నేను రాజీనామాకు సిద్ధం.. లేదంటే బండి సంజయ్‌ రాజీనామా చేస్తారా?

MLA Krishna Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు. చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. నగరంలోని కేపీహెచ్‌బీలో ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, భూ ఆక్రమణలపై బీజేపీ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తే విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను చెరువులు కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. మరి బీజేపీ నేతలు ఆక్రమించారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story