కేటీఆర్‌ వరంగల్‌ పర్యటన రద్దుతో బాధ ఎవరికి..సంబరం ఎవరికి?

కేటీఆర్‌ వరంగల్‌ పర్యటన రద్దుతో బాధ ఎవరికి..సంబరం ఎవరికి?
x
Highlights

ఆయన రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. కాలం కలిసిరాక సైలెంటయ్యాడు. ఎలాగైనా యువరాజుకు తన బాధ, గాథ చెప్పుకోవాలని తపించాడు. ఆ యువరాజా తమ ప్రాంతానికి...

ఆయన రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. కాలం కలిసిరాక సైలెంటయ్యాడు. ఎలాగైనా యువరాజుకు తన బాధ, గాథ చెప్పుకోవాలని తపించాడు. ఆ యువరాజా తమ ప్రాంతానికి వస్తాడు, తను కొత్తగా కట్టుకున్న ఇంట్లో భోజనం చేస్తాడని, పసందైన విందు సిద్దం చేశాడు. భోజనం వడ్డిస్తూనే, లోకల్ లీడర్ల డామినేషన్ తాలుకా సప్రెషన్‌లోంచి పుట్టుకొచ్చిన, డిప్రెషన్‌ క్రియేట్ చేసిన, కమోషన్ రిలేటెడ్‌‌ రెవల్యూషన్‌‌ను యువరాజుాకు విన్నవించి, సొల్యూషన్‌తో ఏదైనా పొలిటికల్ ప్రమోషన్ కొట్టెయ్యాలని తపించాడు. కానీ డామిట్. విందు అడ్డం తిరిగింది. టూర్ క్యాన్సిల్‌ అయ్యింది. ఈ‍యనకు బాధ ఎక్కువైంది. కానీ, కొందరికి మాత్రం పండగైంది. ఆయనగారి విందు రద్దుతో, విందు చేసుకున్నారట కొంతమంది నేతలు. అసలేంటి ఈ విందు కథ.

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ బుధవారం నాటి వరంగల్ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇలా వాయిదా పడడం మూడోసారి. పర్యటన ఏర్పాట్లు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం కోట్లు వెచ్చించిన లోకల్ లీడర్స్, ఈసారి టూర్ రద్దయ్యే కాంప్రమైజ్ లేదని తెగేసి చెప్పారు. కేటిఆర్ పర్యటనను విజయవంతం చేయాలని, ఆయన దృష్టిలో మరింత పడాలని స్థానిక ఎమ్మెల్యేలు తెగ ఉవ్వీల్లూరారు కూడా. కరోనా ఎఫెక్ట్‌తో పర్యటన వాయిదా పడ్డంతో ఇప్పుడా జిల్లాలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అన్నింటికీ పసందైన విందు భోజనంపై రకరకాల డిస్కషన్స్‌ సాగుతున్నాయి.

కేటిఆర్ పర్యటన సందర్బంగా వరంగల్ లో మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి ఇంట్లో విందు ఏర్పాటు చేసారు. గతంలో కూడా కడియం నేరుగా కేటిఆర్ ను కలిసి ఇంటికి భోజనానికి రమ్మని పిలిచారు. కడియం పిలిచిన ప్రతీసారి తాను తప్పక వస్తానని కేటిఆర్ మాటివ్వడం, ఆ తర్వాత పర్యటనలు రద్దు కావడంతో కడియం కుటుంబం నిరాశతో ఉంది. అయితే టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో, జిల్లాలో కడియం ప్రభ తగ్గింది. తన రాజకీయ వైరివర్గం ఎర్రబెల్లి దయాకర్ రావు కేబినేట్‌లో ఉండటం, తనకు అధినేత కేసిఆర్ గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కడియం ఎటూ పాలుపోక సైలంట్ గా ఉంటున్నారు. అయితే ఉన్నపళంగా వరంగల్‌లో కేటిఆర్ పర్యటన సందర్బంగా ఆయనను ఇంటికి పిలిచి భోజనం పెట్టి తన బాధ చెప్పుకుందామనుకుంటున్నారట. కానీ కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దు కావడంతో, అవకాశం లేకుండా పోయింది. కరోనా సమయంలో కేటిఆర్ మంది మర్బాలంతో ఇంటికి వచ్చినా, జిల్లాకు చెందిన నేతల హడావిడి ఉంటుందని తెలిసినా, కరోన వల్ల ఇంట్లోవాల్లు కాస్త భయంతో విందుపై వెనక్కి తగ్గినా, కడియం మాత్రం ఈసారి కేటిఆర్ తో కాసేపు మాటామంతి పెడుదామనుకున్నారట. కానీ టూర్ పోస్ట్‌పోన్‌ అయ్యింది. చాన్స్ మిస్సయ్యింది.

పాపం కేటిఆర్ పర్యటన రద్దు కావడంతో ఏర్పాట్లు చేసుకున్న స్తానిక ఎమ్మెల్యేలు కాసింత బాధపడ్డా, తన ఇంటికి విందుకు రాకుండా వెల్లారని కడియం కూడా ఫీలైనా, ఒకరిద్దరు నేతలు సంబరంతో ఉన్నారట. వరంగల్ స్తానిక ఎమ్మెల్యేల్లో ఒకరు హమ్మయ్య కడియం విందు రాజకీయం బెడిసికొట్టిందన్న హ్యాపీతో ఉన్నారట. ఇక స్టేషన్ ఘన్ పూర్ నుంచి తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే రాజయ్య కూడా కేటిఆర్ టూర్ పోస్ట్ పోన్ కంటే, కడియం ఇంటికి రాకపోవడంతో చాలా సంబరంతో ఉన్నారట. అయితే కడియం అంటే రాజకీయంగా కొంత ఎడమొహం, పెడమొహంతో ఉన్న జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఏ మాత్రం బయటపడకుండా కామ్ గా ఉంటున్నారట.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories