KTR: కమలనాథులకు కేటీఆర్‌ స్వాగతం

KTR: హైదరాబాద్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌ రుచిని .. ఆస్వాదించాలని ట్విట్టర్‌లో సూచన

Jyothi
Published on: 2 July 2022 12:08 PM IST
KTR Welcome To BJP Leaders
X

KTR: కమలనాథులకు కేటీఆర్‌ స్వాగతం

KTR: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌కు వస్తున్న కమలనాథులకు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్వాగతం పలుకుతు చురకలంటించారు. సుందరమైన హైదరాబాద్‌ నగరాన్ని సందర్శించి.. హైదరాబాద్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌ రుచి చూడాలని కోరారు. ఇక్కడి అభివృద్ధిని చూసి.. తమ తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. నియోజకవర్గాలకు వస్తే.. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా గురించి తెలుసుకోవాలని.. అన్ని గ్రామాలకు నల్లా నీటి కనెక్షన్లను తమ నేతలు వివరిస్తారన్నారు.

జాతికి తెలంగాణ అందిస్తున్న సేవలను చూసి.. బీజేపీ నేతలు సెల్యూట్‌ చేయాలన్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌లో దర్శనీయ స్థలాల ఫొటోలను కూడా కేటీఆర్‌ తన పోస్టులో జతచేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ ముఖ్యలు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సమావేశాలు హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటరులో జరుగుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story