KTR: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం.. ఇటుకలతో కొడితే రాళ్లతో కొడుతాం

KTR: రేవంత్ సీఎం అవుతారని ఎవరూ అనుకోలేదు

Shekhar G
Published on: 25 Feb 2024 5:10 PM IST
KTR warns against attacks on party workers
X

KTR: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం.. ఇటుకలతో కొడితే రాళ్లతో కొడుతాం

KTR: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరోకునేది లేదని.. వాళ్లు ఇటుకలతో కొడితే మేము రాళ్లతోనే కొడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అచ్చంపేట పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని కాంగ్రెస్ ముందే చెప్పి ఉంటే ఆ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోయేవన్నారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు. అందుకో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని.. ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story