TS Assembly: కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ

Jyothi
Published on: 16 Dec 2023 1:58 PM IST
KTR VS Ponnam Prabhakar
X

TS Assembly: కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం

TS Assembly: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నేడు సమావేశాలు ప్రారంభం కాగానే కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు.

మధ్యలోనే కల్పించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడామన్నారు.సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. పైన పటారం లోన లొటారం తరహాలో గత ప్రభుత్వం పాలించిందని, ఊపర్ షేర్వాణీ అందర్ పరేషానీ తీరులో పాలన జరిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story