జూపల్లి ఇంటికి మంత్రి కేటీఆర్.. బుజ్జగింపులు?

KTR Visits EX Minister Jupally Krishna Rao House
x

జూపల్లి ఇంటికి మంత్రి కేటీఆర్.. బుజ్జగింపులు?

Highlights

Kollapur: కొల్లాపూర్‌లో బహిరంగ సభ అనంతరం జూపల్లి కృష్ణారావు ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు.

Kollapur: కొల్లాపూర్‌లో బహిరంగ సభ అనంతరం జూపల్లి కృష్ణారావు ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. కొన్నిరోజులుగా జూపల్లి కాంగ్రెస్, బీజేపీలో చేరుతారంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్‌ జూపల్లి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే హర్షవర్దన్‌ రెడ్డిపై జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా జూపల్లిని మంత్రి కేటీఆర్ బుజ్జగించేందుకు వెళ్లినట్లు టాక్ వినబడుతుంది. జూపల్లికి, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మధ్య విభేధాలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే పార్టీ మారకుండా నిలువరించడంతో పాటు టీఆర్‌ఎస్‌లో వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకే కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories