KTR - US Tour: భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన

KTR - US Tour: ఈనెల 29 వరకు కొనసాగనున్న మంత్రి కేటీఆర్ పర్యటన...

Shireesha
Published on: 19 March 2022 1:05 PM IST
KTR US Tour Aimed to Huge Investments in Telangana | Live News
X

KTR - US Tour: భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన

KTR - US Tour: భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్‌డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులతో భేటీ కానున్నారు. ఈనెల 29 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అవుతారు.

గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చిన కేటీఆర్..ఈసారి పర్యటనలో మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.

Shireesha

Shireesha

Next Story