పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ట్వీట్...

KTR - Narendra Modi: దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోవాలంటూ కేటీఆర్ ట్వీట్...

Shireesha
Published on: 31 March 2022 12:17 PM IST
KTR Tweet to PM Narendra Modi about Petrol Diesel Price Hike | Live News
X

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ట్వీట్...

KTR - Narendra Modi: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెట్రోల్ ధరల పెంపుపై ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో పెట్రోల్‌ ధరల పెంపుపై మోడీ చేసిన ట్వీట్‌లను కేటీఆర్‌ షేర్ చేశారు. యూపీఏ హయాంలో పెట్రో ధరల పెంపును ప్రశ్నిస్తూ మోడీ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రీ-ట్వీట్ చేశారు.

అలాగే మిషన్ భగీరథ పథకానికి కేంద్రం సహకారం ఎంత ఉందో దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోవాలన్నారు. సున్నా సహకారం అందించి ప్రచారం చేసుకోవడం ప్రధానమంత్రి స్థాయికి తగినది కాదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Shireesha

Shireesha

Next Story