KTR Tweet: మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్- ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ అప్షన్

KTR Tweet: రుణమాఫీపై ట్విట్టర్ వేదికగా రేవంత్‌ సర్కార్‌‌ను టార్గెట్ చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Aug 2024 11:32 AM IST
KTR Tweet On Rythu Runa Mafi
X

KTR Tweet: మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్- ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ అప్షన్

KTR Tweet: రుణమాఫీపై ట్విట్టర్ వేదికగా రేవంత్‌ సర్కార్‌‌ను టార్గెట్ చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాఫీకానీ రుణమాఫీ- రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తుందని ట్వీట్ చేశారు. సెల్ఫ్‌ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా- ఇచ్చేది పక్కనపెట్టి వాపస్‌పై దృష్టి పెట్టారని కామెంట్ చేశారు. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్- ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ అప్షన్ అంటూ విమర్శించారు.

కేసీఆర్ రైతును రాజు చేస్తే- మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారన్నారు. ఇప్పటికే మాఫీపై మంత్రులు, సీఎం జూటా మాటలు అసత్య ప్రచారాలు.. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు- సెల్ఫీ దిగి రైతును అని నిరూపించుకోవాలా అంటూ నిలదీశారు. ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు.. రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ చేసిందన్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. జై జవాన్.. జై కిసాన్.. జై తెలంగాణ అంటూ ఎండ్ చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story