KTR: ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులు.. అయినా తగ్గేదే లేదు..


KTR: ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులు.. అయినా తగ్గేదే లేదు..
KTR: రుణం తీరలే..! రైతు బతుకు మారలే..! అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR: రుణం తీరలే..! రైతు బతుకు మారలే..! అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లెక్క ప్రకారం.. రైతు రుణాలు 49వేల, 500 కోట్లు ఉందని.. కేబినెట్ భేటీలో చెప్పింది 31 వేల కోట్లు అని.. కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం 26 వేల కోట్లు మాత్రమేనన్నారు.
ఇక మూడు విడతలుగా కలిపి ఇచ్చింది 17వేల 933 కోట్లు మాత్రమేనన్నారు కేటీఆర్. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై.. ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అయినా తగ్గేదే లేదు..నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెబుతామని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ డొల్లా మాటల గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు.
రుణం తీరలే... ! రైతు బతుకు మారలే.. !
— KTR (@KTRBRS) August 17, 2024
✳️ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క రూ. 49,500 కోట్లు
✳️ కేబినెట్ భేటీలో చెప్పింది రూ. 31 వేల కోట్లు
✳️ బడ్జెట్‌లో కేటాయించింది రూ. 26 వేల కోట్లు
❌ 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది రూ. 17933 కోట్లు
ఒకే విడతలో రెండు లక్షల… pic.twitter.com/4QXmif3mE2

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



