KTR: లక్షల నిర్మాణాలు మావి... లక్షల కూల్చివేతలు మీవి

KTR: హైడ్రా కూల్చివేతలపై మరోసారి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 11:07 AM IST
KTR sent legal notice to Kondasurekha in phone tapping case
X

Konda Surekha: కేటీఆర్ లీగల్ యాక్షన్.. దిగివచ్చిన కొండ

KTR: హైడ్రా కూల్చివేతలపై మరోసారి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తోందని విమర్శించారు. తమది నిర్మాణం... వారిది విధ్వంసం అన్నారు. లక్షల నిర్మాణాలు తమవి... లక్షల కూల్చివేతలు వారివని ఆయన ఎద్దేవా చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టలేదని తమపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన కాంగ్రెస్ తీరుపై విమర్శలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించకపోతే రాత్రికి రాత్రే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎలా పుట్టుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి కాంగ్రెస్ కు మింగుడుపడడం లేదని ఆయన చెప్పారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story