logo
తెలంగాణ

Telangana: నేడు బాసర ట్రిపుల్‌ ఐటీకి కేటీఆర్‌...

KTR to Meet Basar IIIT Students Today
X

Telangana: నేడు బాసర ట్రిపుల్‌ ఐటీకి కేటీఆర్‌...

Highlights

KTR: మంత్రి కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

KTR: మంత్రి కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కేటీఆర్ పరామర్శించనున్నారు. ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ జోగు రామన్న తల్లి భోజమ్మ చనిపోయారు. దీంతో జోగురామన్నతో పాటు ఆయన కుటుంబసభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత నిర్మల్ జిల్లా బాసరకు చేరుకొని ట్రిపుల్ ఐటీని సందర్శించనున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీని సందర్శించనున్నారు. మధ్యాహ్నం అక్కడే ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ లంచ్ చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను సందర్శిస్తుండడంతో..విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ రాకతోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండిWeb TitleKTR to Meet Basar IIIT Students Today
Next Story