KTR: అంతర్జాతీయ సదస్సులో రాజకీయ నాటకాలా? యూత్ కాంగ్రెస్ నిరసనలపై కేటీఆర్ సెటైర్లు!

KTR: అంతర్జాతీయ సదస్సులో రాజకీయ నాటకాలా? యూత్ కాంగ్రెస్ నిరసనలపై కేటీఆర్ సెటైర్లు!
KTR: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ (AI Impact Summit) వేదికగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చేపట్టిన నిరసనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
KTR: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ (AI Impact Summit) వేదికగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చేపట్టిన నిరసనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచే ఇలాంటి వేదికలను రాజకీయ నాటకాల కోసం వాడుకోవడం అత్యంత విచారకరమని ఆయన మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..
ఢిల్లీలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే, యూత్ కాంగ్రెస్ సభ్యులు నిరసనలకు దిగారు. ఈ పరిణామంపై కేటీఆర్ ట్విట్టర్ (X) వేదికగా ఘాటుగా స్పందించారు.
కేటీఆర్ విమర్శల సారాంశం:
అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యే సదస్సులలో రాజకీయ అసమ్మతిని ప్రదర్శించడం వల్ల ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ.. ఎక్కడ, ఎలా స్పందించాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ వేదికలు రాజకీయ పోరాటాలకు తావు కావని స్పష్టం చేశారు.
సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అనుబంధ విభాగమైన యూత్ కాంగ్రెస్ నిరసనలు చేపట్టడం హాస్యాస్పదమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "రాజకీయ నాటకాల కోసం ఇలాంటి వేదికలను ఎంచుకోవడం అత్యంత విచారకరం" అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో నిరసనలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.
It is absolutely deplorable that members of the Youth Congress chose the AI Impact Summit 2026 as a venue for petty political theatrics
— KTR (@KTRBRS) February 21, 2026
Using such a global platform for protests will project our great nation India in a poor light internationally
While difference of opinion is… pic.twitter.com/sM3MmIb8UJ

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



