
KTR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ (SIT) విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ (SIT) విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు నోటీసులివ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు కదిలారని, మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పైశాచిక ఆనందం కోసమే విచారణ: "కేసీఆర్‌ను గంటల తరబడి కూర్చోబెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ సిట్ విచారణలు. నంది నగర్ వస్తే వందల మంది పోలీసులను పెడతారా? పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతుంటే శాంతిభద్రతలు గాలికొదిలేశారా?" అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలని, మొదట సెలబ్రిటీలు అన్నారని, ఇప్పుడు ఏమీ లేదని తేలిపోయిందని ఆయన విమర్శించారు.
సింగరేణి కుంభకోణంపై సీబీఐ విచారణ ఏది? సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని కేటీఆర్ నిలదీశారు. సృజన్ రెడ్డి కాల్ డేటా బయటకు తీస్తే అన్నీ బయటపడతాయని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
ఢిల్లీకి 60 సార్లు వెళ్లినా దక్కింది సున్నా: కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. "ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం సాధించుకొచ్చారు? ఉపాధి హామీ, ఎరువుల రాయితీలకు నిధులు కుదించినా నోరు మెదపరా? బయో ఫార్మాకు రూ. 10 వేల కోట్లు కేటాయిస్తే, ఫార్మా హబ్ అయిన హైదరాబాద్‌కు రూ. 10 కూడా ఇవ్వలేదు" అని ఎద్దేవా చేశారు. హైస్పీడ్ రైల్ కారిడార్ భౌగోళికంగా హైదరాబాద్ మీదుగా వెళ్లక తప్పదని, దాన్ని కేంద్రం ఇచ్చిన గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని, భారీ రోడ్ షోలు లేకపోయినా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



