KTR: రాజ‌గోపాల్ రెడ్డి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే..

KTR: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కుసంసారంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 14 March 2022 4:47 PM IST
KTR Slams Komatireddy Rajagopal Reddy
X

KTR: రాజ‌గోపాల్ రెడ్డి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే.. 

KTR: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కుసంసారంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని మీద కోటమిరెడ్డి వ్యాఖ్యలు సరైనవి కాదని కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో అవినీతి జరిగితే విచారించేందుకు చాలా విభాగాలు ఉన్నాయి.. ఇంకా కోర్టులు ఉన్నాయి. కానీ మంత్రిని పట్టుకుని అలాంటి మాటలు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. మంత్రి త‌ల‌సానికి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో రాజ‌గోపాల్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story