KTR: మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్.. ఇంకా 35 రోజులే మిగిలింది..!

KTR: ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Nov 2024 11:01 AM IST
KTR Says Paddy Procurement Centers Are Not Working In Telangana
X

KTR: కాంగ్రెస్ ఆఫీసులో కనుగోలు కేంద్రం తప్ప.. రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం పనిచేస్తలేదు

KTR: ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరువేరుతుందన్న మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్టయిందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. మూడు వందల ముప్పై రోజులు ముగిసిందని, ఏడాది నిండడానికి ఇంకా 35 రోజులే మిగిలిందని రాసుకొచ్చారు.

చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే, చెప్పని మూసీలో.. లక్షల కోట్ల మూటలాయే అంటూ ఎద్దేవా చేశారు. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్‌తో సర్కార్ పబ్బం గడిపిందని ఆరోపించిన ఆయన, ప్రజాపాలనలో ధర్నాలు, రాస్తారోకోలు తప్ప ఏముంది గర్వకారణమంటూ ప్రశ్నించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story